Covid: మిల్కా సింగ్‌ కన్నుమూత 

భారత దిగ్గజ స్ప్రింటర్‌ మిల్కాసింగ్‌ (91) కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత నెల 20న ఆయనకు కరోనా సోకడంతో గత నెల రోజులుగా...

Updated : 19 Jun 2021 08:52 IST

చండీగఢ్‌: భారత దిగ్గజ స్ప్రింటర్‌ మిల్కాసింగ్‌ (91) కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మే 20న ఆయనకు కరోనా సోకడంతో అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1932 నవంబర్‌ 20న పంజాబ్‌ (పాకిస్థాన్‌) గోవింద్‌పురలోని సిక్‌ రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో మిల్కాసింగ్‌ జన్మించారు. భారతదేశ క్రీడా ఆణిముత్యంగా కీర్తి గడించారు. పరుగు పోటీల్లో అరుదైన రికార్డులు నెలకొల్పారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో బ్రిటీష్‌ ప్రభుత్వం, కామన్‌వెల్త్‌ పోటీల్లో అరుదైన ఘనత సాధించారు. 46.6 సెకన్లలో 440 యార్డ్స్‌ పరుగెత్తి స్వర్ణం గెలిచిన మిల్కా.. భారత్ తరపున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. 1959లో కేంద్ర ప్రభుత్వం మిల్కాసింగ్‌కు పద్మశ్రీ ప్రదానం చేసింది. ఆయన జీవితం ఆధారంగా  బాలీవుడ్‌లో ‘బాగ్‌ మిల్కా బాగ్‌’ చిత్రం రూపొందించారు. మిల్కా సతీమణి నిర్మల్‌ కౌర్‌ గతవారం కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని