covid 19: హాకీ దిగ్గజం కన్నుమూత

భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన రవీందర్‌పాల్‌ సింగ్‌ (60) శనివారం ఉదయం కొవిడ్‌ తదనంతర ఇబ్బందులతో కన్నుమూశారు....

Published : 08 May 2021 13:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన రవీందర్‌పాల్‌ సింగ్‌ (60) శనివారం ఉదయం కొవిడ్‌ తదనంతర ఇబ్బందులతో కన్నుమూశారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌ విజేత జట్టులో ఆయన సభ్యుడు. కరోనా  వైరస్‌ సోకడంతో ఏప్రిల్‌ 24న  లఖ్‌నవూలోని వివేకానంద ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. వైరస్‌ నుంచి కోలుకోవడం, నెగెటివ్‌ రావడంతో గురువారం ఆయనను సాధారణ వార్డుకు తరలించారు. శుక్రవారం హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు.

రవీందర్‌పాల్‌ సింగ్‌ 1984 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లోనూ ఆడారు. కరాచీ వేదికగా జరిగిన 1980, 83 ఛాంపియన్స్‌ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్‌ జూబ్లీ కప్‌ (హాంకాంగ్‌), 1982 ప్రపంచకప్‌ (ముంబయి), 1982 ఆసియా కప్‌ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1979లో జూనియర్‌ ప్రపంచకప్‌లోనూ ప్రాతినిధ్యం వహించారు. ఆయన తన జీవితాన్ని ఆటకే అంకితం చేశారు. వివాహం కూడా చేసుకోలేదు. మేనకోడలు ప్రగ్యా యాదవ్‌ ఇప్పటి వరకు ఆయనను చూసుకున్నారు.  హాకీ ఇండియా, కేంద్ర  క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని