Dhoni : ల్యాండ్ రోవర్ కారు సొంతం చేసుకున్న ధోని.. ప్రత్యేకతలేంటో తెలుసా..!

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని పేరు వినగానే ఎవరికైనా.. అతడు సాధించిన ఘన విజయాలే గుర్తొస్తాయి. కెప్టెన్‌గా భారత జట్టుని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. భారత క్రికెట్...

Published : 19 Jan 2022 01:36 IST

(Photo : Big Boy Toyz India Instagram)

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని పేరు వినగానే ఎవరికైనా.. అతడు సాధించిన ఘన విజయాలే గుర్తొస్తాయి. కెప్టెన్‌గా భారత జట్టుని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ధోనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. వింటేజ్‌ కార్లు, బైకులన్నా అంతే ఇష్టం. వాటి కోసమే ఓ గ్యారేజ్‌ను నిర్వహిస్తున్నాడంటే.. అవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అతడి గ్యారేజ్‌లోకి మరో వింటేజ్‌ ల్యాండ్‌ రోవర్‌ కారు చేరింది. 

గత నెలలో గురుగ్రామ్‌లోని ‘బిగ్ బాయ్‌ టాయ్జ్ (బీబీటీ)‌’ అనే షో రూం నిర్వహించిన వేలంలో పాల్గొన్న ధోని.. 1970 మోడల్‌కి చెందిన ల్యాండ్ రోవర్‌ 3 కారుని సొంతం చేసుకున్నాడు. ఈ ల్యాండ్ రోవర్‌ కారుకి ఆటోమొబైల్‌ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 1970 దశకం నుంచి 1980 మధ్య కాలం వరకు దీన్ని తయారు చేసేవారు. 2.25 లీటర్ల ఇంజిన్‌ సామర్థ్యం గల ఈ కారు మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. ఆన్‌లైన్‌ వేలం ద్వారా 50 శాతానికి పైగా స్టాక్‌ను విక్రయించినట్లు బీబీటీ షో రూం పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని