Sachin Tendulkar: సచిన్‌ తెందూల్కర్‌ బలహీనతను బయటపెట్టిన మురళీధరన్‌

ఎంత గొప్ప ఆటగాడికైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కి కూడా ఆఫ్ స్పిన్‌

Published : 20 Aug 2021 22:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎంత గొప్ప ఆటగాడికైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కి కూడా ఆఫ్ స్పిన్‌ ఆడటంలో చిన్న బలహీనత ఉందని శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. ‘‘సచిన్ తెందూల్కర్‌కు బౌలింగ్ చేయాలంటే నాకు భయం ఉండదు. ఎందుకంటే అతడు ఎక్కువగా హిట్టింగ్ చేయడు. కానీ, సెహ్వాగ్ హిట్టింగ్ చేస్తాడు. సచిన్ తెందూల్కర్ తన వికెట్‌ని కాపాడుకుంటాడు. బంతి ఎటువైపు వస్తుంది అనే విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. అతడికి టెక్నిక్ తెలుసు” అని ముత్తయ్య మురళీధరన్ అన్నాడు.

"సచిన్‌ లెగ్ స్పిన్‌లో మెరుగ్గా ఆడగలడు. ఆఫ్ స్పిన్‌ బౌలింగ్‌ని ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడతాడు. ఎందుకంటే అతడిని నేను చాలాసార్లు అవుట్ చేశాను. అంతేకాదు.. చాలా మంది ఆఫ్ స్పిన్నర్లు అతడిని పెవిలియన్‌కి పంపించడాన్ని చుశా. దీంతో ఆఫ్ స్పిన్‌ ఆడటంలో సచిన్‌కి  కొంచెం బలహీనత ఉందని భావించా. దీని గురించి నేను అతడితో ఎప్పుడూ మాట్లాడలేదు. సచిన్‌ బలహీనత ఏంటో తెలుసు కాబట్టి ఇతర బౌలర్లతో పోల్చితే ఎక్కువసార్లు అతడిని ఔట్‌ చేశా. ఏదేమైనా సచిన్‌ కఠినమైన ఆటగాడు. అతడి వికెట్‌ని సాధించడం చాలా కష్టం’’ అని ముత్తయ్య వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని