Neeraj chopra: అమితాబ్‌ ‘జంజీర్‌’ డైలాగ్‌ని నీరజ్‌ ఎలా చెప్పాడంటే..

బాలీవుడ్‌ దిగ్గజం బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఓ పక్క, టోక్యో ఒలింపిక్స్‌ విజేతలుగా నిలిచిన జావెలిన్‌ క్రీడాకారుడు నీరజ్‌చోప్రా, హాకీ జట్టు గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ మరో పక్క. ఇక వారు చేసిన సందడికి ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి 13’ వేదికైంది. అమితాబ్‌ హోస్ట్‌గా వ్యవహరించే ఈ ప్రతిష్ఠాత్మక క్విజ్‌ షోకి కంటెస్టెంట్స్‌గా

Updated : 07 Dec 2022 14:19 IST

 కేబీసీ షోలో టోక్యో ఒలింపిక్‌ విజేతలు నీరచ్‌ చోప్రా, పీఆర్‌ శ్రీజేష్‌

ముంబయి: బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఓ పక్క, టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో విజేత నీరజ్‌చోప్రా, హాకీ జట్టు గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ మరో పక్క. ఇక వారు చేసిన సందడికి ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి 13’ వేదికైంది. అమితాబ్‌ హోస్ట్‌గా వ్యవహరించే ఈ ప్రతిష్ఠాత్మక క్విజ్‌ షోకి కంటెస్టెంట్స్‌గా హాజరయ్యారు ఈ భారత్‌ ఒలింపిక్‌ క్రీడాకారులు. షోలో ప్రారంభంలో.. అమితాబ్‌ నీరజ్, శ్రీజేష్‌ను ఒకసారి మీ మెడల్స్‌ను పట్టకోవచ్చా అని అడగగా.. ‘బాబోయ్‌! ఈ మెడల్‌ ఏంటి ఇంత బరువు ఉంది’ అంటూ బిగ్‌బి చమత్కరించారు. ఇక శ్రీజేష్‌ మాట్లాడుతూ ‘‘సర్‌! ఈరోజు మేమిద్దరం మీకు హర్యన్వి భాష నేర్పించేందుకు సిద్ధమయ్యాం’’ అనగానే ‘‘హే భగవాన్‌’’ అంటూ అందరి ముఖాలపై నవ్వులు పూయించారు అమితాబ్‌. 1973లో వచ్చిన ‘జంజీర్‌’ చిత్రంలో అమితాబ్‌ ఫేమస్‌ డైలాగ్‌ హిందీలో ఉండగా.. నీరజ్‌ దాన్ని హర్వన్వి భాషలోకి మార్చి వినిపించారు.

అసలెందుకు రా మీకు హాకీ అన్నారు: పీఆర్‌ శ్రీజేష్‌ 

2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మా హాకీ టీమ్‌ క్వాలిఫై అయినప్పటికీ ఒక మ్యాచ్‌ కూడా గెలవలేకపోయాం. తిరిగి ఇండియాకు వచ్చాక అందరూ మమ్మల్ని చూసి నవ్వడం ప్రారంభించారు. ఏ ఫంక్షన్‌కి వెళ్లినా చివర్లో నిలబడండి అంటూ అవమానించేవారు. అసలు ఎందుకు ఈ హాకీ ఆట ఆడుతున్నారంటూ బాధపెట్టారు.  అలాంటిది ఎప్పుడైతే 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో అలాంటి వాళ్ల నోళ్లకు మూతపడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని