Neeraj Chopra: అదే కసి.. బల్లెం పట్టిన నీరజ్‌..!

విజయాన్ని ఎంత వరకు ఆస్వాదించాలో తెలిసిన వారే ఛాంపియన్లు అవుతారు. ‘వచ్చిన పతకాన్నే చూస్తూ కాలం గడపకుండా.. దానిని పక్కన పెట్టి కొత్త లక్ష్యంపై గురిపెడతాను’

Published : 21 Oct 2021 15:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయాన్ని ఎంత వరకు ఆస్వాదించాలో తెలిసిన వారే ఛాంపియన్లు అవుతారు. ‘వచ్చిన పతకాన్నే చూస్తూ కాలం గడపకుండా.. దానిని పక్కన పెట్టి కొత్త లక్ష్యంపై గురిపెడతాను’ అని ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా చెప్పిన మాటలు.. ఇవి కేవలం మాటలకే పరిమితం కాలేదు.. ఒలింపిక్‌ విజయం తర్వాత దాదాపు రెండున్నర నెలలు వివిధ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన నీరజ్‌ ఇప్పుడు ఆటపై దృష్టిపెట్టారు. బల్లెం పట్టుకొని మైదానంలోకి అడుపెట్టారు. 

అదే విషయాన్ని నీరజ్‌ చోప్రా  సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ‘‘ విజయం కోసం అదే కసి.. అదే ఆకలితో ఈ వారం శిక్షణను పునఃప్రారంభించాను. గత ఒలింపిక్స్‌ కోసం ఎక్కడైతే శిక్షణ మొదలు పెట్టానో.. ఇప్పుడు మొదలు పెట్టడానికి అదే ఉత్తమమైన ప్లేస్‌. నాకు మద్దతుగా సందేశాలు పంపినందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.  తాను సాధాన మొదలుపెట్టిన ఫొటోలను అభిమానులతో పంచుకొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని