Neeraj Chopra: ఈఏడాదికి ఇక ముగింపు పలుకుతున్నా: నీరజ్‌ చోప్రా

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణ పతాకరం సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు నీరజ్‌ చోప్రా. తాజాగా నీరజ్‌.. 2021 సీజన్‌కి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయనో పోస్ట్‌ విడుదల చేశారు. ‘‘ టోక్యో నుంచి భారత్‌కు వచ్చాక మీ ప్రేమ, ఆప్యాయతలను పంచినందుకు అందరికీ ధన్యవాదదాలు. దేశవ్యాప్తంగా ఇంత ప్రేమ పొందడం చాలా సంతోషంగా ఉంది.

Updated : 27 Aug 2021 15:26 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు నీరజ్‌ చోప్రా. తాజాగా నీరజ్‌.. 2021 సీజన్‌కి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయనో పోస్ట్‌ విడుదల చేశారు.

‘‘టోక్యో నుంచి భారత్‌కు వచ్చాక మీ ప్రేమ, ఆప్యాయతలను పంచినందుకు అందరికీ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా ఇంత ప్రేమ పొందడం చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేను. 2021 సీజన్‌కి ముగింపు పలుకుతున్నా. ప్రయాణ షెడ్యూల్‌తో పాటు అనారోగ్యం కారణంగా టోక్యో నుంచి వచ్చాక శిక్షణను తిరిగి ప్రారంభించలేకపోయాను. ఈఏడాదికి ఇలా ముగింపు పలికి మళ్లీ రిఛార్జ్‌ అవ్వాలనుకుంటున్నా. వచ్చే ఏడాది 2022లో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌, ఆసియా గేమ్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మరింత బలంగా మీ ముందుకు వస్తా. కొన్ని వారాలుగా భారత అథ్లెట్ల నుంచి నాకు మద్దతు లభించింది. జై హింద్‌’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని