Neeraj chopra: నీరజ్‌ చోప్రాకి తీవ్రజ్వరం, గొంతునొప్పి

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌చోప్రా తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో కరోనా పరీక్ష చేయగా నెగిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవలే టోక్యో నుంచి దిల్లీకి వచ్చిన నీరజ్‌.. పలు సన్మానాలు, ఇంటర్య్వూలతో బిజీగా మారారు.

Published : 15 Aug 2021 02:07 IST

 కరోనా టెస్ట్‌లో నెగిటివ్‌

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌చోప్రా తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో కరోనా పరీక్ష చేయగా నెగిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవలే టోక్యో నుంచి దిల్లీకి వచ్చిన నీరజ్‌.. పలు సన్మానాలు, ఇంటర్య్వూలతో బిజీగా మారారు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అగ్రస్థానంలో నిలిచి.. ఈటెను 87.58 మీటర్లు విసిరి నీరజ్‌ భారత్‌కు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని