Khel Ratna Award: ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు నామినేట్‌ అయ్యింది వీరే..

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్రత్న 2021 అవార్డుకు 11 మంది, అర్జున అవార్డుకు 35 మంది అథ్లెట్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం విడుదల చేసింది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ ఖేల్‌ రత్నా..

Updated : 27 Oct 2021 20:00 IST

దిల్లీ: మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న-2021 అవార్డుకు 11 మంది, అర్జున అవార్డుకు 35 మంది అథ్లెట్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం నామినేట్‌ చేసింది. ఖేల్‌రత్నా అవార్డుకు టోక్యో ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ నామినేట్‌ అయ్యారు. క్రికెటర్‌ శిఖర్‌ దావన్, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవీనా పటేల్‌ తదితరులు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఏటా జులై-ఆగస్టులో ఈ జాతీయ అవార్డుల ప్రదానం ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ఖేల్‌ రత్నా అవార్డు 2021 

* నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)

* రవి దహియా (రెజ్లింగ్)

* పీఆర్‌ శ్రీజేష్ (హాకీ)

* లవ్లీనా బొర్గోహైన్‌ (బాక్సింగ్)

* సునీల్ చెత్రీ (ఫుట్‌బాల్)

* మిథాలీ రాజ్ (క్రికెట్)

* ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)

* సుమిత్ అంటిల్ (అథ్లెటిక్స్)

* అవని ​​లేఖరా (షూటింగ్)

* కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్)

* మనీష్ నర్వాల్ (షూటింగ్)


అర్జున అవార్డ్‌ 2021

* యోగేష్ కథునియా (డిస్కస్ త్రో)

* నిషద్ కుమార్ (హైజంప్)

* ప్రవీణ్ కుమార్ (హైజంప్)

* శరద్ కుమార్ (హైజంప్)

* సుహాస్ LY (బ్యాడ్మింటన్)

* సింగ్‌రాజ్ అధానా (షూటింగ్)

* భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్)

* హర్విందర్ సింగ్ (ఆర్చరీ)

* శిఖర్ ధావన్ (క్రికెట్)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని