Neeraj Chopra: నటుడిగా మారిన నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా క్రెడ్ యాడ్‌లో నటించి నెటిజన్ల మనుసులు దోచుకుంటున్నాడు
‘క్రెడ్’ యాడ్‌లో అయిదు అవతారాల్లో సందడి
ఇంటర్నెట్ డెస్క్: ఇన్ని రోజులు నీరజ్ చోప్రా అంటే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్‌గానే పరిచయం. కానీ అతడిలో దాగి ఉన్న నటుడి గురించి మీకు తెలుసా. తాజాగా నీరజ్ ‘క్రెడ్’ అనే క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్ ఫీచర్ యాడ్‌లో నటించి చక్కటి యాక్టింగ్ స్కిల్స్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ యాడ్‌లో జర్నలిస్టుగా, క్యాషియర్‌గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా, ఫిల్మ్‌మేకర్, జావెలిన్ త్రోయర్ కావలనుకుంటున్న వ్యక్తిగా కనిపించాడు ఈ యూత్ ఐకాన్. ఒక్కోదాంట్లో ఒక్కోరకంగా తన నటనను ప్రదర్శించి నవ్వులు కురిపించాడు. ఈ ఏడాది ‘క్రెడ్’ సంస్థకి ప్రచారకర్తగా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యక్తిగా కంట్రోల్ తప్పి కోపంగా కనిపించే పాత్రలో అద్భుతంగా కనిపించాడు. ఇక బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ జుంబా ఇన్స్ర్టక్టర్గా క్రెడ్యాడ్లో కనిపించాడు. వీరిద్దరిని కేవలం ఒక్క గెటప్‌లోనే చూపించగా... నీరజ్‌ని మాత్రం అయిదు అవతారాల్లో చూపించే ప్రయత్నం చేసింది. కాగా నీరజ్ ‘‘360 డిగ్రీ మార్కెటింగ్’’ అని క్రెడిట్ క్లబ్‌ని ట్యాగ్ చేసి ట్విటర్ వేదికగా ఈ వీడియోని పంచుకున్నాడు నీరజ్. షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇది వైరల్ అయింది. ఇప్పటికే ట్విటర్లో రెండు మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకొని ముందుకు దూసుకెళ్తోంది. తనలో కొత్తకోణాన్ని చూపించిన ఈ యూత్ ఐకాన్‌ను నెటిజన్లే కాదు సెలబ్రెటీలు అభినందిస్తున్నారు. ‘‘ప్రజలంతా నీ బయోపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ ప్రకటనతో నువ్వు యాక్టింగ్‌లోకి ప్రవేశించావు’’ అని బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ట్వీట్ చేశారు. నీరజ్ యాక్టింగ్ గురించి మాజీ భారత ఆటగాడు, డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్వీట్ చేశాడు. ‘‘నీ యాక్టింగ్ చాలా బాగుంది.. నీ బయోపిక్‌లో నువ్వే నటించాలి, బాలీవుడ్ స్టార్ల వారసులకు పోటీ ఇచ్చే మొనగాడు వచ్చాడ్రోయ్!’’ అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం