ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌

ప్రపంచ నంబర్ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌తో జరిగిన ఫైనల్లో 7-6, 6-2, 6-2 తేడాతో...

Updated : 21 Feb 2021 17:33 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ నంబర్ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌తో జరిగిన ఫైనల్లో 7-6, 6-2, 6-2 తేడాతో ఘన విజయం సాధించాడు. తొలిసెట్‌ హోరాహోరీగా సాగినా.. తర్వాతి రెండు సెట్లలో అతడే‌ పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఏస్‌లు సంధించిన అతడు.. 20 విన్నర్లు కొట్టాడు.

కాగా, జకోవిచ్‌కు తన కెరీర్‌లో ఇది 18వ గ్రాండ్‌స్లామ్‌. అయితే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడం ఇది తొమ్మిదోసారి. వరుసగా గత మూడుసార్లు ఈ టైటిల్‌ను అందుకున్నాడు. అంతేగాక అతడు ఆడిన అన్ని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లోనూ విజయం సాధించడం విశేషం. 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 టోర్నీల్లో విజేతగా నిలిచాడు. మరోవైపు ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల జాబితాలో ఫెదరర్, నాదల్ సరసన చేరడానికి జకోవిచ్‌ మరో రెండు టైటిళ్ల దూరంలో ఉన్నాడు. ఫెదరర్‌, నాదల్ చెరో 20 గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని