french open : ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేత జకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో ఐదోసీడ్ సిట్సిపాస్‌పై జకోవిచ్ 6-7, 2-6, 6-3, 6-2...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో ఐదోసీడ్ సిట్సిపాస్‌పై జకోవిచ్ 6-7, 2-6, 6-3, 6-2,6-4 తేడాతో విజయం సాధించి మరోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో జకోవిచ్ 19 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రెండు సెట్లను గెలిచి కెరీర్లో మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుందామనుకున్న గ్రీక్ వీరుడు సిట్సిపాస్ ఆశలను జకో వమ్ము చేశాడు. తొలి రెండు కోల్పోయి వెనుకపడ్డ జకో.. అద్భుతంగా పుంజుకున్నాడు. ఇక ఆపై వెనుదిరగని జకో 6-3, 6-2తో ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. దీంతో నాలుగుసెట్లు ముగిసే సరికి ఇద్దరు సమంగా నిలిచారు. ఇక నిర్ణయాత్మక ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. గెలుపు కోసం ఇద్దరూ తమ శక్తినంతా దారపోశారు. అయితే వరల్డ్ నంబర్‌వన్ జకో తన అనుభవంతో చివరిసెట్ను 6-4 తేడాతో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్‌ను ముద్దాడాడు. ఈ విజయంతో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లను కనీసం రెండుసార్లు గెలిచిన మొదటి వ్యక్తిగా జకో చరిత్రకెక్కాడు. జకోవిచ్ చివరిసారిగా 2016లో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు. జకోవిచ్ మరో టైటిల్ సాధిస్తే 20 టైటిళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్ హోల్డర్లుగా ఉన్న ఫెదరర్, నాదల్ సరసన నిలుస్తాడు.
డబ్సుల్స్లోనూ తనే..
మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రెజికోవా-సినియాకోవా జోడీ సొంతం చేసుకుంది. ఫైనల్లో క్రెజికోవా-సినియాకోవా జంట 6-4, 6-2 తేడాతో స్వైతెక్-సాండ్స్పై గెలుపొందారు. నిన్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను క్రెజికోవా గెలుచుకున్న విషయం తెలిసిందే. సింగిల్స్ విజేత డబుల్స్‌లోనూ గెలవడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్‌తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్‌కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్‌ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్‌కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్‌ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్‌లో 12.5, రెండో వాల్ట్‌లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్‌లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్‌కుమార్‌రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్‌లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్‌తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్‌బడ్స్