Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం.. విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రో వీరుడు నీరజ్​ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది......

Published : 25 Jan 2022 19:27 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రో వీరుడు నీరజ్​ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. నీరజ్‌ను కేంద్ర ప్రభుత్వం.. ‘పరమ విశిష్ట సేవా పతకం’తో సత్కరించనుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చోప్రాకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఈ అవార్డును అందజేయనున్నారు.

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో 384 మంది రక్షణ సిబ్బందికి గ్యాలంటరీ సహా ఇతర అవార్డులను కోవింద్‌ బహూకరించనున్నారు. వీరిలో 12 మంది శౌర్య చక్ర, 29 పరమ్‌ విశిష్ట సేవా పురస్కారాలు, నలుగురు ఉత్తమ యుద్ధ సేవా పురస్కారాలతోపాటు మరికొందరు పలు అవార్డులను అందుకోనున్నారు. కాగా నీరజ్​ ఆర్మీలో సుబేదార్​గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడిని విశిష్ట సేవా పతకంతో కేంద్రం సత్కరించనుంది.

భారతదేశ వందేళ్ల కలను సాకారం చేస్తూ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ విభాగంలో నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో​ జావెలిన్‌ను 87.58మీటర్ల దూరం విసిరి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు​.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని