Rohit-Kohli: వారిద్దరూ నిక్కచ్చిగా.. సూటిగా మాట్లాడతారు: సల్మాన్‌ భట్

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌...

Published : 18 Nov 2021 21:26 IST

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ చాలా అద్భుతంగా మాట్లాడారని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు సల్మాన్ భట్‌ ప్రశంసించాడు. భారత క్రికెటర్ల మీద పడుతున్న పనిభారాన్ని తగ్గించేందుకు ఏం చేయాలో తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. మరీ ముఖ్యంగా క్లిష్టమైన ప్రశ్నలకు సారథి రోహిత్‌ శర్మ స్పష్టమైన సమాధానాలను ఇచ్చాడని సల్మాన్‌ భట్ పేర్కొన్నాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీ పాత్రపై రోహిత్ సరైన బదులిచ్చాడు. కోహ్లీ రాకతో బ్యాటింగ్‌ మరింత బలోపేతం అవుతుందని తెలిపాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇద్దరూ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా సూటిగా ఉంటారని భట్‌ కొనియాడాడు. ఎంఎస్ ధోనీ టీమ్‌ఇండియా జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇది మొదలైందని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో సల్మాన్‌ భట్ మాట్లాడుతూ.. ‘‘ ఇందులో ఎలాంటి సందేహం లేదు. విరాట్, రోహిత్‌లలో ఇష్టపడే అంశం ఏంటంటే.. మీడియా సమావేశాల్లా చాలా నిక్కచ్చిగా ఉంటారు. ధోని సారథిగా వచ్చినప్పటి మొదలు అదే కొనసాగుతుంది. భారత కెప్టెన్లు చాలా సూటిగా మాట్లాడతారు. సరైన సమాధానాలు ఇస్తారు’’ అని వివరించాడు. 

క్రీడాకారులు.. సాధారణ పౌరులు ఎవరైనా సరే తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరముంటుందని సల్మాన్‌ భట్‌ అభిప్రాయపడ్డాడు. లేకపోతే తమ ప్రదర్శన, పనితనంలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం కష్టమేకానీ.. స్థిరత్వం అయితే వస్తుందన్నాడు. ‘ఆటగాళ్లు యంత్రాలు కాదు’ అన్న రోహిత్ శర్మ వ్యాఖ్యలను సల్మాన్‌ భట్‌ సమర్థించాడు. ‘‘ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. లేకపోతే బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో జోరును కొనసాగించడం కష్టం. క్రికెటర్లు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే వారు శక్తివంతంగా తిరిగి వచ్చి మరింత మెరుగ్గా రాణించగలరు. రోహిత్‌ వాదనతో నేను పూర్తిగా అంగీకరిస్తున్నా’’ అని భట్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని