paralympics:బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం దక్కింది. బ్యాడ్మింటన్‌ పురుషుల ఎస్‌ఎల్-3 విభాగంలో ప్రమోద్‌

Updated : 04 Sep 2021 17:57 IST

టోక్యో:పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. పురుషుల బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-3 విభాగంలో  ప్రమోద్‌ భగత్‌ స్వర్ణం సాధించాడు. ఇదే విభాగంలో మనోజ్ సర్కార్‌ కాంస్య పతకం అందుకున్నాడు.

గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన డేనియల్‌ బెథెల్‌పై ప్రమోద్‌ భగత్‌ 21-14,21-17 తేడాతో విజయం సాధించి.. పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. కాంస్య పతక పోరులో మనోజ్‌ సర్కార్‌ జపాన్‌కు చెందిన పుజిహారాను 22-20, 21-13 తేడాతో  ఓడించి ‘కంచు’మోగించాడు.

దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 17కి చేరింది. ఇందులో నాలుగు స్వర్ణ, ఏడు రజత, ఆరు కాంస్య పతకాలున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని