paralympics: పతక విజేతలపై ప్రశంసల వర్షం
టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం సాధించిన పారా షట్లర్ ప్రమోద్ భగత్, కాంస్యం అందుకున్న మనోజ్ సర్కార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ, బీజింగ్(2008 ) ఒలింపిక్స్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, భారత మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్,
ఇంటర్నెట్ డెస్క్: టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం సాధించిన పారా షట్లర్ ప్రమోద్ భగత్, కాంస్యం అందుకున్న మనోజ్ సర్కార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ, బీజింగ్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, భారత మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు వీరికి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
శనివారం జరిగిన పురుషుల బ్యాడ్మింటన్ ఎస్ఎల్-3 విభాగం ఫైనల్లో ప్రమోద్ భగత్ స్వర్ణం సాధించాడు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌పై ప్రమోద్ భగత్ 21-14,21-17 తేడాతో విజయం సాధించి.. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఇక, ఎస్ఎల్-3 విభాగంలోనే కాంస్యం కోసం జరిగిన పోరులో మనోజ్ సర్కార్ జపాన్‌కు చెందిన పుజిహారాను 22-20, 21-13 తేడాతో ఓడించి ‘కంచు’మోగించాడు.
‘ప్రమోద్ భగత్ యావత్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అతడు ఛాంపియన్. ఈ విజయం ఎన్నో లక్షల మందిని చైతన్యపరుస్తుంది. ప్రమోద్ అద్భుతమైన పట్టుదలను చూపించాడు. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలిచినందుకు అతడికి అభినందనలు. భవిష్యత్‌లో కూడా రాణించాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
‘బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్ 1 ప్రమోద్ భగత్ పారాలింపిక్స్ లేదా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత మొదటి షట్లర్. అద్భుతమైన ప్రదర్శన. ఛాంపియన్‌కి అభినందనలు’ అని అభినవ్ బింద్రా ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్‌నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ ఒకటి. లఖ్‌నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్‌గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్‌కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్‌కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్‌కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్