IND vs NZ: భయం లేకుండా ఆడతా

తన ఆలోచన విధానంలో మార్పొచ్చిందని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌  చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భయం లేకుండా ఆడతానని తెలిపాడు. టెస్టుల్లో టీమ్‌ఇండియా విజయాల్లో పుజారా కీలకపాత్ర

Updated : 24 Nov 2021 07:40 IST

కాన్పూర్‌: తన ఆలోచన విధానంలో మార్పొచ్చిందని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌  చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భయం లేకుండా ఆడతానని తెలిపాడు. టెస్టుల్లో టీమ్‌ఇండియా విజయాల్లో పుజారా కీలకపాత్ర పోషిస్తున్నా.. చాలాకాలంగా సెంచరీ సాధించకపోవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో దూకుడుగా ఆడుతూ పుజారా సరికొత్తగా కనిపించాడు. ‘‘నిజమే. నాక్కూడా అనిపించింది. నా ఆలోచన విధానంలో కొంచెం మార్పొచ్చింది. టెక్నిక్‌లో ఏమార్పూ లేదు. అతిగా ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం లేదని అనిపించింది. అనవసర విషయాలు ఆలోచించకుండా ఆటను ఆస్వాదించాలని తెలుసుకున్నా. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అలాంటి దృక్పథంతో ఆడా. కివీస్‌తో సిరీస్‌కు సన్నాహాలు బాగున్నాయి. ఇంగ్లాండ్‌లో మాదిరే భయం లేకుండా ఆడాలనుకుంటున్నా. భారత పరిస్థితుల్లో ఆడిన అనుభవం రానున్న టెస్టుల్లో నాకు కలిసిరానుంది. సెంచరీ గురించి ఆందోళన లేదు. జట్టు కోసం బ్యాటింగ్‌ చేయడమే నా పని. నేను పరుగులు సాధించకుండా లేను. 80లు, 90లు రాబట్టా. బాగా బ్యాటింగ్‌ చేస్తున్నంతసేపు, జట్టుకు సహకారం అందిస్తున్నంత వరకు సెంచరీ గురించి బాధపడను. ఆజింక్య రహానె గొప్ప ఆటగాడు. ప్రతి ఆటగాడి కెరీర్‌లో గడ్డు పరిస్థితులు ఉంటాయి. ఆటలో భాగమది. ఎత్తుపల్లాలు సహజం. రహానె ఆత్మవిశ్వాసం గల ఆటగాడు. భారీస్కోరుకు రహానె ఒక ఇన్నింగ్స్‌ దూరంలో ఉన్నాడని నమ్ముతున్నా. ఒకసారి భారీ శతకం సాధిస్తే ఫామ్‌లోకి వచ్చేస్తాడు. రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా రావడం చాలామంది ఆటగాళ్లకు సహాయంగా ఉంటుంది. అండర్‌-19, ఇండియా-ఎ రోజుల్లో ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన యువ ఆటగాళ్లతో పాటు నాలాంటి సీనియర్లకు అతని మార్గనిర్దేశనం ఎంతో ఉపయోగపడుతుంది’’ అని పుజారా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని