PV sindu: బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో పోటీపడనుంది. డిసెంబరులో స్పెయిన్‌లో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్స్‌ సమయంలో  అథ్లెట్స్‌ కమిషన్‌కు ఎన్నికలు

Updated : 24 Nov 2021 07:34 IST

దిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో పోటీపడనుంది. డిసెంబరులో స్పెయిన్‌లో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్స్‌ సమయంలో అథ్లెట్స్‌ కమిషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. అథ్లెట్స్‌ కమిషన్‌లో ఆరు స్థానాలు ఉండగా 9 మంది క్రీడాకారుల్ని సిఫార్సు చేసింది. అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యులు 2021 నుంచి 2025 వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యురాలిగా ఉన్న సింధు మరోసారి ఎన్నికల్లో పోటీపడుతుంది. 2017లో తొలిసారిగా సింధు అథ్లెట్స్‌ కమిషన్‌కు ఎంపికైంది. ‘‘స్పెయిన్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో డిసెంబరు 17న అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తాం. ప్రస్తుత అథ్లెట్స్‌ కమిషన్‌ నుంచి సింధు ఒక్కరే మరోసారి ఎన్నికల్లో బరిలో దిగుతుంది. ఆరుగురు క్రీడాకారిణులు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు’’ అని బీడబ్ల్యూఎఫ్‌ పేర్కొంది. అథ్లెట్స్‌ కమిషన్‌కు ఎంపికైన సభ్యులు ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. అనంతరం అథ్లెట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ను బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌లోకి తీసుకుంటారు. సింధుతో పాటు గ్రేసియా పోలి (ఇండోనేసియా), ఆడమ్‌ హాల్‌ (స్కాట్లాండ్‌), హదియా హోస్నీ (ఈజిప్ట్‌), ఐరిస్‌ వాంగ్‌ (అమెరికా), కిమ్‌ సోయెంగ్‌ (కొరియా), రాబిన్‌ టేబిలింగ్‌ (నెదర్లాండ్స్‌), సొరాయ (ఇరాన్‌), జెంగ్‌ వీ (చైనా)లు అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని