PV Sindu: సెమీస్‌లో సింధు
ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో మూడో సీడ్ సింధు 14-21, 21-19, 21-14తో సిమ్ యుజిన్ (కొరియా)పై గెలుపొందింది.
సాత్విక్ జోడీ ముందంజ
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో మూడో సీడ్ సింధు 14-21, 21-19, 21-14తో సిమ్ యుజిన్ (కొరియా)పై గెలుపొందింది. 66 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిపై సింధు పైచేయి సాధించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సాత్విక్- చిరాగ్ 21-19, 21-19తో జో ఫెయ్- నూర్ ఐజుద్దీన్ (మలేసియా)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 12-21, 8-21తో రెండో సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ ఇంతానన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు, టాప్ సీడ్ మార్కస్ గిడియోన్- కెవిన్ సుకములో (ఇండోనేసియా)తో సాత్విక్- చిరాగ్ తలపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్