R Praggnanandhaa: మరోసారి కార్ల్‌సన్‌ను ఓడించి షాకిచ్చిన ప్రజ్ఞానంద
భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు మూడు నెలల వ్యవధిలో రెండోసారి షాకించ్చాడు..
ఇంటర్నెట్‌డెస్క్: భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు మూడు నెలల వ్యవధిలో రెండోసారి షాకిచ్చాడు. ప్రస్తుతం జరుగుతోన్న ‘చెస్సబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్’లో పాల్గొన్న వీరిద్దరూ శుక్రవారం ఐదో రౌండ్లో తలపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ హోరాహోరీగా ఆడడంతో చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే, చివరి క్షణాల్లో కార్ల్సన్ 40వ మూవ్లో తప్పు చేయడంతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. దీంతో మొత్తం 12 పాయింట్లు సాధించిన ఈ భారత యువ గ్రాండ్ మాస్టర్ ఈ టోర్నీలో నాకౌట్ దశకు చేరేందుకు మరింత దగ్గరయ్యాడు. శుక్రవారం సాయంత్రానికి అతడు ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. కార్ల్సన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన ‘ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్’లోనూ ప్రజ్ఞానంద.. ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.