BCCI: సీనియర్లకు విశ్రాంతి.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టిదే

త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. నిలకడగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌..

Updated : 12 Nov 2021 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. నిలకడగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసింది. విరామం లేకుండా ఆడుతున్న విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి వంటి కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినివ్వడంతో.. అంజిక రహానెకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఛెతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రెండో టెస్టుకు విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది.

బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టిదే..

అజింక్య రహానె (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, అక్షర్‌ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్ సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని