Rahane: ఆ నిర్ణయం తీసుకునేందుకు ద్రవిడ్, కోహ్లీ మొగ్గు చూపరేమో! : లక్ష్మణ్
కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాడిగా విఫలమైన అజింక్య రహానెకు...
ఇంటర్నెట్ డెస్క్: కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాడిగా విఫలమైన అజింక్య రహానెకు రెండో టెస్టులో మరొక అవకాశం దక్కొచ్చని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్‌కు దురదృష్టవశాత్తూ తుది జట్టులో స్థానం ఉండదేమోనని అంచనా వేశాడు. టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తుండటంతో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే రహానెను తప్పించేందుకు కోచ్ ద్రవిడ్, కోహ్లీ మొగ్గు చూపకపోవచ్చన్నాడు. కోహ్లీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడని, ఈ క్రమంలో మిడిలార్డర్లో పుజారా-రహానెలపైనే ఆధారపడే అవకాశం ఉందని వివరించాడు.
అయితే కివీస్ మాజీ పేస్ బౌలర్ సైమన్ డౌల్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘మొదటి టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్‌ను విస్మరించడం కష్టసాధ్యం. అందుకే ఫామ్‌లో లేని అజింక్య రహానె స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చే అవకాశం ఉంది. ఆటగాడి మీద నమ్మకం అనేది కొంత సమయం వరకే ఉంటుంది. ఇప్పటివరకు పుజారా, రహానెలపై మేనేజ్మెంట్ ఎంతో భరోసా కలిగి ఉంది. పుజారా గత 39 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ లేకుండానే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. రహానె కూడా ఇదే స్థాయి ప్రదర్శన ఇస్తున్నాడు. రహానె సగటు కూడా యాభై నుంచి 40 దిగువకు పడిపోయింది. అందుకే ఈ సారి రహానెను తప్పించే అవకాశం ఉంది ’’ అని తెలిపాడు.
వృద్ధిమాన్ సాహా సూపర్ ఫైటర్: వీవీఎస్
కివీస్‌పై రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత అర్ధశతకం (61 నాటౌట్) సాధించిన కీపర్ వృద్ధిమాన్ సాహాను లక్ష్మణ్ పొగడ్తలతో ముంచెత్తాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడైన సాహాతో లక్ష్మణ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ‘‘సాహా అసాధారణమైన ఫైటర్. జట్టు ఆటగాడు’’ అని అభినందించాడు. కీలకమైన సమయంలో రాణించి టీమ్ఇండియాను శాసించే స్థాయికి చేర్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్