Rahul - BCCI: చురచుర చూపులే కాదు.. బంతిని గిరిగిరా తిప్పేస్తా

న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ఇండియా మాంచి జోష్‌లో ఉంది. కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అందించిన...

Published : 25 Nov 2021 01:52 IST

నెట్‌ ప్రాక్టీస్‌లో బౌలింగ్‌ చేసిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ‘‘అబ్బో.. ట్రైనింగ్‌ సెషన్స్‌లో రాహుల్ ద్రవిడ్‌ చాలా స్ట్రిక్ట్‌. అసలు ఆటగాళ్లతో చనువుగా ఉంటాడో లేదో’’ అనే అనుమానాలు చాలా వచ్చాయి. అయితే ఒకరకంగా చెప్పాలంటే శిక్షణ సమయంలో చురచుర చూపులతో ద్రవిడ్‌ కఠినంగా ఉంటాడనే మాట వాస్తవమే కానీ.. మరీనూ భయపెట్టేంత కాదని బీసీసీఐ షేర్‌ చేసిన వీడియోను చూస్తే మనకర్థమవుతుంది. తాను పక్కన ఉండి చూసే రకం మాత్రమే కాదు.. ఆటగాళ్లతో ఆడి మరీ ట్రైనింగ్‌ ఇస్తా అన్నట్లుగా ఉంటుంది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా కాసేపు బౌలర్‌గా మారి బ్యాటర్లకు బౌలింగ్‌ చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ ఎవరైనా కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్‌ ఉన్నారా? అని క్యాప్షన్‌ పెట్టింది. దీనికి భారీగా స్పందించిన క్రికెట్‌ అభిమానులు వేలల్లో లైకులు కొట్టారు. ఆటగాడిగా టెస్టుల్లో, వన్డేల్లో అప్పుడు బంతులను విసిరిన రాహుల్‌ కోచ్‌గా ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బౌలింగ్‌ చేయడం విశేషం. కెరీర్‌ మొత్తం మీద 164 టెస్టుల్లో 20 ఓవర్లు వేసిన రాహుల్‌ 39 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్‌ కూడా పడగొట్టాడు. అదే వన్డేల్లో 344 మ్యాచ్‌లకుగాను 31 ఓవర్లు వేసి 170 పరుగులు ఇచ్చాడు. నాలుగు వికెట్లు తీశాడు. రాహుల్‌ అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 2/43.

న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ఇండియా మాంచి జోష్‌లో ఉంది. కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అందించిన తొలి టైటిల్‌. ఈ క్రమంలో రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, షమీ, బుమ్రా వంటి సీనియర్లు అందుబాటులో ఉండరు. వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్‌ దక్కింది. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, శుభమన్‌ గిల్, కేఎస్‌ భరత్‌ వంటి కొత్త బ్యాటర్లు జట్టులోకి వచ్చారు. అయితే వీరిలో తుది జట్టులో ఉండేదెవరో రేపే తేలుద్ది. మొదటి టెస్టుకు సారథిగా అజింక్య రహానె బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ షేర్‌ చేసిన వీడియో మీ కోసం... 

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని