Ravi Shastri: అప్పుడు గంగూలీతో విభేదాలు వచ్చిన మాట వాస్తవమే: రవిశాస్త్రి

టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. దీంతో అతడి స్థానంలో భారత మాజీ ఆటగాడు ‘ది వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ని ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. 2016లో తనకు, ప్రస్తుత

Published : 13 Nov 2021 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. దీంతో అతడి స్థానంలో భారత మాజీ ఆటగాడు ‘ది వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. 2016లో తనకు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, నాటి క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరభ్‌ గంగూలీకి మధ్య మనస్పర్థలు వచ్చిన మాట నిజమేనని రవిశాస్త్రి వెల్లడించాడు. అప్పుడు టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం ఇంటర్వ్యూ జరిగిన సమయంలో గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెందూల్కర్ సీఏసీ సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నాడు.

‘‘గంగూలీది, తనది చాలా పాత పరిచయం. అతడు నా స్నేహితుడు. పరస్పరం గౌరవించుకుంటాం. అతడి అభిప్రాయాలు అతడికి ఉంటాయి. ఒక్కోసారి మా మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు. సౌరవ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. గంగూలీ నాకు జూనియర్‌. గతంలో దాదా.. టైమ్స్ షీల్డ్ టోర్నీలో టాటా స్టీల్‌కి ఆడుతున్నప్పుడు నేను కెప్టెన్‌గా ఉన్నా’ అని రవిశాస్త్రి అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని