Sachin: పెద్ద పులులను చూడటం అమితానందం

వణ్య మృగాలైన పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అడవుల మనుగడకు అవి కూడా కారణమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం...

Published : 30 Jul 2021 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్య మృగాలైన పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అడవుల మనుగడకు అవి కూడా కారణమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు చేసిన మాస్టర్‌ బ్టాస్టర్‌.. ఒకానొక సమయంలో తాను సందర్శించిన తబోడా-అంధేరీ టైగర్‌ రిజర్వ్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వాటి ఆవశ్యకతపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే పెద్ద పులులను చూడటం ఎప్పటికీ అమితానందం కలిగిస్తుందని వ్యాఖ్యానం జతచేశారు.

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ సైతం పులుల సంరక్షణపై ఓ పోస్టు పెట్టారు. ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా వన్యమృగాల ప్రేమికులకు, వాటిని సంరక్షించడానికి అంకితభావంతో పనిచేస్తున్న వారికి అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70శాతం పులులకు నిలయమైన భారత్‌లో.. టైగర్‌-ఫ్రెండ్లీ ఇకో సిస్టమ్‌ వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నా’మని మోదీ ట్వీట్‌ చేశారు. కాగా, ఇటీవల అంతరించిపోతున్న వన్య మృగాల్లో పులులు మొదటివరుసలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాటిపై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని