Sanju Samson : ఆ నాలుగేళ్లు ద్రవిడ్‌తో ప్రయాణం.. నా కెరీర్‌పై ప్రభావం చూపింది: సంజూ

 టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకంలో ఆడటం తన కెరీర్‌పై...

Published : 04 May 2022 02:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకంలో ఆడటం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని రాజస్థాన్‌ సారథి సంజూ శాంసన్‌ వెల్లడించాడు. దిల్లీ, రాజస్థాన్‌ జట్లకు రాహుల్ ద్రవిడ్‌ మెంటార్‌గా వ్యవహరించిన సమయంలో మూడు నాలుగేళ్లపాటు ఆడటం జీవితంలో మరిచిపోలేనని సంజూ పేర్కొన్నాడు.  ‘‘ఆ నాలుగేళ్లపాటు ద్రవిడ్‌తో సమయం గడపడం చాలా బాగుంది. ప్రతి విషయాన్ని అడిగేవాడిని. దానిని వెంటనే నోట్‌బుక్‌లో ఎక్కించేవాడిని. ప్రతి రోజూ ఇంతే. రాహుల్‌తో మాట్లాడిన వెంటనే రూమ్‌లోకి వెళ్లి ఏం చెప్పాడో రాసి పెట్టుకునేవాడిని’’ అని వివరించాడు. రాజస్థాన్‌ (2013- 2015, 2018 నుంచి కొనసాగుతూ), దిల్లీ (2016-2017) తరఫున సంజూ శాంసన్‌ ఆడాడు.

‘‘రాహుల్‌ ద్రవిడ్‌ యువ క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించేవాడు. దిల్లీ తరఫున నేను ఆడేటప్పుడు అప్పటికే కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, రిషభ్‌ పంత్ ఉన్నారు. మేమందరం అదే అనుభవం పొందాం. ఎంతో నేర్చుకున్నాం. నాకైతే పూర్తిగా గుర్తు లేదు కానీ.. మాలో నలుగురినో ఐదుగురినో పిలిచి చెప్పాడు. మీరంతా టీమ్‌ఇండియాకు ఆడతారు. ఇది ప్రతి యువ క్రికెటర్‌కు ఎంతో ఉత్సాహానిస్తోంది’’ అని సంజూ శాంసన్‌ తెలిపాడు. ప్రస్తుతం టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ (12) ఆరు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో  స్థానంలో ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని