IND vs ENG:బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌లాగా అతడు వికెట్లు పడగొట్టలేడు: మైకెల్ హోల్డింగ్

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో  శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడని వెస్టిండీస్ దిగ్గజం మైకెల్‌ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు.  ఇంగ్లాండ్‌ పిచ్‌లపై జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లాగా అతడు వికెట్లు పడగొట్టలేడని

Published : 06 Sep 2021 01:11 IST

(Photo:Shardul Thakur Twitter)


ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో  శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చని వెస్టిండీస్ క్రికెట్‌ దిగ్గజం మైకెల్‌ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లాగా అతడు వికెట్లు పడగొట్టలేడని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్.. చివరికి 290 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత భారత బౌలర్లు విజృంభించినా.. తర్వాత తేలిపోయారు. దీంతో ఇంగ్లాండ్ మంచి పరుగులు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్.. ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే మైకెల్‌ హోల్డింగ్  ఈ విధంగా వ్యాఖ్యానించారు.‘ఇంగ్లాండ్ ఆటగాళ్లపై భారత బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. శార్దూల్‌ బౌలింగ్ చేసినా బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ లాగా వికెట్లు తీయలేకపోయాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై అతడు ప్రభావం చూపలేడు. చాలా రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బుమ్రా, ఉమేశ్ ఇద్దరూ బాగా బౌలింగ్‌ చేశారు’అని మైకెల్‌ హోల్డింగ్ వివరించారు. అయితే, శార్దూల్‌ తొలి ఇన్నింగ్స్‌లో.. బంతితో అంతగా రాణించనప్పటికీ.. బ్యాట్‌తో మాత్రం రాణించాడు. కేవలం 36 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టు స్కోరు 191 పరుగులకు చేరడంలో కీలకపాత్ర  పోషించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు