IPL 2021: కోల్‌కతా గెలిస్తే.. ఆ కప్‌లోనే కాఫీ తాగుతా: షారుఖ్‌ ఖాన్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తుదిపోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) తలపడనున్నాయి. ఈ పోరులో కోల్‌కతా విజయం సాధిస్తే.. ఆ కప్‌లోనే కాఫీ..

Updated : 15 Oct 2021 17:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తుదిపోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) తలపడనున్నాయి. ఈ పోరులో కోల్‌కతా విజయం సాధిస్తే.. ఆ కప్‌లోనే కాఫీ తాగుతానని ఆ జట్టు యజమాని షారుఖ్‌ ఖాన్‌ గతంలో ట్విటర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. 

గతంలో ట్విటర్‌ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్‌ఎస్‌ఆర్కే’ సెషన్‌లో ఓ అభిమాని.. ఈ సారి కోల్‌కతా కప్ గెలుస్తుందా..? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా.. ‘గెలుస్తుందనే అనుకుంటున్నా.. ఒకవేళ కోల్‌కతా కప్‌ గెలిస్తే ఆ కప్‌లోనే కాఫీ తాగుతాను’ అని షారుఖ్‌ ఖాన్‌ సమాధానం ఇచ్చాడు. గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా జట్టు 2012, 2014 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆ జట్టు ఐపీఎల్‌ ఫైనల్‌కి చేరింది. మరోవైపు ఎనిమిది సార్లు ఫైనల్‌ ఆడి మూడుసార్లు ట్రోఫీ గెలుచుకున్న చెన్నై జట్టు.. మరో కప్‌ సాధించాలనే జోష్‌తో ఉంది. హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్‌లో.. విజేతగా నిలిచేదెవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని