Ravi Shastri: లెజెండ్స్‌ క్రికెట్ లీగ్‌ కమిషనర్‌గా రవిశాస్త్రి

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆరంభం కానున్న లెజెండ్స్‌ క్రికెట్ లీగ్‌ (ఎల్‌ఎల్‌సీ)కి కమిషనర్‌గా వ్యవహరించనున్నాడు. ‘వివిధ

Published : 15 Nov 2021 20:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆరంభం కానున్న లెజెండ్స్‌ క్రికెట్ లీగ్‌ (ఎల్‌ఎల్‌సీ)కి కమిషనర్‌గా వ్యవహరించనున్నాడు. ‘వివిధ దేశాల క్రికెట్‌ లెజెండ్లతో కలిసి పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం. లెజెండ్‌ క్రికెట్ లీగ్‌లో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో ప్రత్యేక టోర్నమెంట్‌. ఈ లీగ్‌లో దిగ్గజ ఆటగాళ్లను మరోసారి మైదానంలో తలపడనున్నారు. కొత్తగా వాళ్లు నిరూపించుకోవడానికి ఏం లేకపోయినా.. వాళ్లు ఆడుతుంటే చూడటం అభిమానులకు గొప్ప అనుభూతినిస్తుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ లీగ్‌లో ఇండియా, పాకిస్థాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశాలకు చెందిన మాజీ దిగ్గజ క్రికెటర్లు తలపడనున్నారు. ‘ఇండియా’, ‘ఆసియా’, ‘రెస్ట్ ఆఫ్‌ ది వరల్డ్‌’ పేర్లతో మూడు జట్లు బరిలోకి దిగనున్నాయి. 

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌తో టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని