IND vs NZ: రాహుల్‌ ద్రవిడ్‌ని అందుకే నమ్ముతున్నా: సునీల్ గావాస్కర్‌

భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జైపూర్ వేదికగా నేడే తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌గా, రెగ్యులర్‌ టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించబోతున్నారు.

Published : 18 Nov 2021 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జైపూర్ వేదికగా నేడే తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌గా, రెగ్యులర్‌ టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించబోతున్నారు. వీరిద్దరూ కలిసి జట్టుని ఏ విధంగా ముందుకు తీసుకెళతారనేదిపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ స్వభావాలు ఒకే రకంగా ఉంటాయని, వారి మధ్య సమన్వయం బాగుంటుందని భారత మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్ అన్నారు.

“రాహుల్ ద్రవిడ్‌ క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో అతడు (ద్రవిడ్‌) క్రీజులో ఉన్నంత వరకు భారత బ్యాటింగ్‌కు ఢోకాలేదని భావించేవాళ్లం. ప్రధాన కోచ్‌గా కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్న అతడిని నేను నమ్మడానికి అదే కారణం. ద్రవిడ్‌ కోచ్‌గా విజయవంతమవుతాడని నమ్ముతున్నాను. ద్రవిడ్, రోహిత్‌ స్వభావాలు ఒకేలా ఉంటాయి. ద్రవిడ్‌లాగే రోహిత్‌ కూడా ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి, వారి మధ్య సమన్వయం బాగుంటుందని భావిస్తున్నా. ఎందుకంటే వారిద్దదూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు” అని సునీల్ గావాస్కర్ అన్నారు. 

రాహుల్‌ ద్రవిడ్‌ విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా విజయవంతమయ్యాడని అతడు కోచ్‌గా సక్సెస్‌ అవుతాడని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ద్రవిడ్ గురించి ఆలోచించగానే అతడి కచ్చితమైన ప్రణాళిక, దాని అమలు గుర్తుకు వస్తాయని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ప్రస్తుతం కోచ్‌గా అతడు పెద్ద లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించినందువల్ల, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం లేదని అన్నాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని