సన్నీలో.. ఇంత ఆవేశమా?
అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు బలైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆటలో సాంకేతికత ఎంత పెరిగినా ఇప్పటికీ వారు పొరపాట్లు పడుతూనే ఉంటారు. 1981లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు టీమ్ఇండియాకు ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అంతగా అనుభవం లేని రెక్స్ వైట్‌హెడ్ నిర్ణయాలతో ....
ఇంటర్నెట్ డెస్క్: అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు బలైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆటలో సాంకేతికత ఎంత పెరిగినా ఇప్పటికీ వారు పొరపాట్లు పడుతూనే ఉంటారు. 1981లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు టీమ్ఇండియాకు ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అంతగా అనుభవం లేని రెక్స్ వైట్‌హెడ్ నిర్ణయాలతో కెప్టెన్ సునిల్ గావస్కర్ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఒకానొక దశలో తన సహచరుడు చౌహాన్‌తో కలిసి వాకౌట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడం గమనార్హం.
ఆసీస్ పేసర్ డెన్నిస్ లిల్లీతో సునిల్ గావస్కర్‌కు విపరీతమైన పోటీ ఉండేది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. ఈ సిరీసులోనూ అలాంటిదే జరిగింది. మూడు మ్యాచుల సిరీసులో అప్పటికే ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. సన్నీ ఫామ్‌లో లేడు. దాంతో కీలకమైన మెల్బోర్న్ టెస్టులో నిలవాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు తగ్గట్టే ఆడుతున్నాడు. 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు లిల్లీ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఆ బంతి బ్యాటు అంచుకు తగిలిందన్నది సన్నీ వాదన. అందుకు నిరాకరించిన అంపైర్ మాత్రం ఔటిచ్చాడు.
తీవ్ర నిరాశకు గురైన సన్నీ ఔటవ్వలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇంతలోనే లిల్లీ ముందుకొచ్చి అశ్లీలంగా మాట్లాడాడు! దాంతో ఆవేశపడ్డ గావస్కర్ అవతలి ఎండ్‌లో ఉన్న సహచరుడు చౌహాన్‌ను తీసుకొని బయటకు వచ్చాడు. కానీ టీమ్ఇండియా మేనేజర్ చౌహాన్‌ను అడ్డుకొని మ్యాచ్ కొనసాగేలా చూశాడు. గావస్కర్ ఎల్బీపై సందిగ్ధం ఉన్నప్పటికీ అప్పటికే ఏడు తప్పుడు నిర్ణయాలు ఇచ్చిన వైట్హెడ్పై అసహనం ఇలా ప్రదర్శించాడని అంటారు. కొన్నాళ్ల తర్వాత అలా చేసుండాల్సింది కాదని సన్నీ ఒప్పుకోవడం గమనార్హం.
ఇవీ చదవండి
ఓటమిపై సాకులొద్దు.. పునఃసమీక్షించండి
రూట్ పైపైకి.. కోహ్లీ కిందకు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్‌ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్