
T20 World Cup: ధోనీ ఉండటం ఆ ఆటగాళ్లకు లాభం: సురేశ్‌రైనా
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ధోనీ మెంటార్‌గా ఉండటం జట్టులో యువ ఆటగాళ్లకు ఎంతో మేలుచేస్తుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్లో వారు ఆడడం టీ20 ప్రపంచకప్‌లో కలిసొస్తుందని రైనా పేర్కొన్నాడు.
‘‘టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో దాదాపు అందరూ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఆడారు. ధోనీ కూడా జట్టుతో ఉన్నాడు. కాబట్టి జట్టు ఎంతో ఉత్సాహాంగా ఉందని భావిస్తున్నా. ఎందుకంటే ధోనీ టీమ్ఇండియా కెప్టెన్ అయినప్పుడు మేం యువకులం. ధోనీ నుంచి యువ క్రికెటర్లు పూర్తి సహకారం పొందుతారు’’ అని ఓ కార్యక్రమంలో రైనా అన్నాడు.
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించినప్పుడే ధోనీని కూడా జట్టు మెంటార్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం టీ20 ప్రపంచకప్ వరకు మాత్రమే ధోనీ మెంటార్‌గా కొనసాగుతాడని పేర్కొంది. మెంటార్‌గా సేవలందించేందుకు అతడు ఎటువంటి ఫీజూ తీసుకోవడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ.. ఈ టీ20 ప్రపంచకప్‌లో కూడా తన వ్యూహాలను అమలు చేసి టీమ్ఇండియాను ఛాంపియన్‌గా నిలపాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 2007లో ధోనీ సారథ్యంలోనే భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ని ముద్దాడింది. తర్వాత ఛాంపియన్‌గా నిలవలేదు. ఈ సారైనా విశ్వవిజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.