Sushil Kumar: ప్రశ్నిస్తే..పెదవి విప్పడం లేదట!

రిమాండులో ఉన్న రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పోలీసులకు సహకరించడం లేదట. వారు అడిగిన ప్రశ్నలకు అతడు సరైన జవాబులు ఇవ్వడం లేదని తెలుస్తోంది....

Published : 26 May 2021 14:08 IST

దిల్లీ: రిమాండులో ఉన్న రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పోలీసులకు సహకరించడం లేదట. వారు అడిగిన ప్రశ్నలకు అతడు సరైన జవాబులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. పదేపదే ప్రశ్నిస్తున్నా పెదవి విప్పడం లేదని సమాచారం. గ్యాంగ్‌స్టర్లతో అతడికున్న సంబంధాలపై అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అతడికి ఆరు రోజుల రిమాండ్‌ విధించింది. ఇందులో భాగంగా పోలీసులు అతడిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. సోమవారం రాత్రంతా జైలులో విలపించిన సుశీల్‌ను మంగళవారం ఛత్రసాల్‌ స్టేడియం, మోడల్‌ టౌన్‌లోని అతడి ఇంటికి తీసుకెళ్లారు. దాడి జరిగిన తీరును పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నించారు. ఆధారాలు సేకరించేందుకు ఫొరెన్సిక్‌ నిపుణుల సహాయం తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని