
T20 World Cup: సంబరాలు ఎందుకు చేసుకోలేదంటే.? కారణం చెప్పిన జిమ్మీ నీషమ్
ఇంటర్నెట్ డెస్క్: అబుదాబి వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై కివీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ విజయంలో ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ కీలక పాత్ర పోషించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన నీషమ్ 11 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఓ ఫోర్ ఉన్నాయి. జట్టు విజయం సాధించాక సహచర ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోతే.. జిమ్మీ మాత్రం అలాగే కుర్చిలో కూర్చుండిపోయాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘సంబరాలు చేసుకోకుండా ఎందుకలా కూర్చుండిపోయావ్’ అని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు ప్రశ్నించగా.. జిమ్మీ ఈ విధంగా సమాధానమిచ్చాడు. ‘నా పని నేను పూర్తి చేశాను. ఫలితం గురించి పట్టించుకోను’ అని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. మరో స్థానం కోసం దుబాయ్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
Advertisement