ashwin-kohli: కోహ్లీ ఎనర్జీ లెవల్స్‌ అమోఘం.. ఫిట్‌నెస్‌ సాధించడం కష్టమే: అశ్విన్‌

భారత సారథి విరాట్‌ కోహ్లీని కెప్టెన్సీని, ఆటతీరును రవిచంద్రన్ అశ్విన్‌ కొనియాడాడు. కోహ్లీ  ఎనర్జీ లెవల్స్‌...

Updated : 05 Nov 2021 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సారథి విరాట్‌ కోహ్లీని కెప్టెన్సీని, ఆటతీరును రవిచంద్రన్ అశ్విన్‌ కొనియాడాడు. కోహ్లీ  ఎనర్జీ లెవల్స్‌ అమోఘమని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు కోహ్లీ ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో వివరించాడు. టీ20 ప్రపంచకప్‌ ముగిశాక టీ20 జట్టు సారథ్యం బాధ్యతల నుంచి తప్పుకోనున్న కోహ్లీ బర్త్‌డే ఇవాళ. స్టార్‌స్పోర్ట్స్‌ పోస్టు చేసిన వీడియోలో సీనియర్‌ బౌలర్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘కోహ్లీ ఎనర్జీ లెవల్స్ అద్భుతం. ఆటను మనసారా ఆస్వాదిస్తూ ఆడతాడు. కోహ్లీ నాయకత్వంలో ఎర్రబంతి (టెస్టు ఫార్మాట్‌)తో ఆడినప్పుడు గమనించిన విషయం ఇదే. ఒక్కోసారి తన సారథ్యం, జట్టును నడిపించే తీరును చూసినప్పుడు కోహ్లీకి ఇంత శక్తి సామర్థ్యం ఎలా వచ్చాయో అనిపిస్తుంటుంది. మైదానంలోనూ, వెలుపల కోహ్లీ ఎంతో ఉత్సాహంగా ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. 

భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో అందరికీ తెలిసిందే. ఇదే విషయంపై అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘గ్రౌండ్‌లో ఆటగాళ్లలో కోహ్లీ నింపే స్ఫూర్తి, ఉత్తేజం బయట ఉన్నవారిపైనా ప్రభావం చూపుతుందేమోనని అనుకుంటా. జట్టులోకి కొత్త సంస్కృతిని కోహ్లీ పరిచయం చేశాడు. ఉన్నతంగా నిలబడి తమ గొంతుకను వినిపించాలనే విధంగా మార్పు తెచ్చాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లీ ఫిటెనెస్‌ ఎవరికీ ఉండకపోవచ్చు. తనతో సహా జట్టులోని ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోహ్లీ చూసుకుంటాడు’’ అని అశ్విన్‌ తెలిపాడు. దాదాపు నిమిషంపైన ఉన్న ఆ వీడియోను మీరూ చేసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని