ఈ విజయం అద్భుతం.. అపూర్వం..

మొదటి టెస్టులో పరాభవం పాలై, రెండో టెస్టులో పుంజుకొని అన్ని రంగాల్లో ఆదిపత్యం చలాయించి ఘన విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది....

Updated : 29 Dec 2020 12:23 IST

టీమిండియాకు శుభాకాంక్షల వెల్లువ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొదటి టెస్టులో పరాభవం పాలై, రెండో టెస్టులో పుంజుకొని అన్ని రంగాల్లో ఆదిపత్యం చలాయించి ఘన విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో మరపురాని విజయం సొంతం చేసుకున్న టీమిండియా ఆటతీరును దిగ్గజాలు కొనియాడారు. సచిన్‌‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సెహ్వాగ్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లైన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, షమి, ఇశాంత్‌ శర్మ అందుబాటులో లేకపోయినా రహానె జట్టును ముందుండి నడిపించిన విధానం.. బౌలర్లను సద్వినియోగం చేసుకున్న తీరు అద్భుతమని పేర్కొన్నారు. జట్టులో అందుబాటులో లేని విరాట్‌ కూడా జట్టు సభ్యులను, కెప్టెన్‌ను కొనియాడాడు.

మొదటి టెస్టులో ఓటమితో వెనుకబడి.. సిరీస్‌ను సమం చేసేందుకు జట్టు చూపిన తెగువ ఎంతగానో ఆకట్టుకుంది. విరాట్‌, రోహిత్‌, ఇశాంత్‌, షమి లేకుండా టెస్టు మ్యాచ్‌లో మీరు సాధించిన విజయం ఎంతో ప్రత్యేకమైనది. వెల్‌డన్‌ టీమిండియా.- సచిన్‌

ఇది అద్భుతమైన విజయం. జట్టు సమష్టి కృషికి దక్కిన ఫలితం. సభ్యుల ఆట తీరు.. ముఖ్యంగా రహానె జట్టును నడిపించిన విధానం ప్రశంసనీయం. విజయాలను ఇలాగే కొనసాగించండి - విరాట్ కోహ్లీ

ఈ విజయంలో ఎన్నో సానుకూలంశాలున్నాయి. జట్టును రహానే అద్భుతంగా నడిపించాడు. బౌలర్లు మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన ఇద్దరి ఆట ఎంతో ఆకట్టుకుంది. ఆత్మవిశ్వాసంతో వారు ఆడిన విధానం ప్రశంసనీయం. - వీవీఎస్‌ లక్ష్మణ్‌

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఈ విజయం అపూర్వమైనది. రహానె జట్టును ముందుండి నడిపించాడు. బౌలర్లు విధ్వంసం సృష్టించారు. గిల్‌ ఆకట్టుకున్నాడు.-వీరేంద్ర సెహ్వాగ్

మరిచిపోలేని విజయం. సీనియర్లు అందుబాలులో లేనప్పటికీ భారత జట్టు ఆడిన నాణ్యమైన ఆట ఆకట్టుకుంది. విదేశాల్లో గొప్పగా గెలిచిన మ్యాచ్చుల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. రహానెతోపాటు ఆ జట్టుకు శుభాకాంక్షలు. - ఆకాశ్‌ చోప్రా

మెల్‌బోర్న్‌లో టీమ్‌ఇండియాకు అద్భుత విజయం దక్కింది. మ్యాచ్‌ మొత్తంలో ఆటగాళ్ల పట్టుదల, అంకితభావం చూడముచ్చటగా అనిపించాయి.  -రోహిత్‌ శర్మ

ఇవీ చదవండి...

రెండో టెస్టులో విజయం మనదే

ఒక రేంజ్‌ క్రికెటర్లు బాబూ..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని