Virat Kohli - Anushka Sharma: కోహ్లీ నిర్ణయంపై అనుష్క రియాక్షన్ ఇది
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ గురువారం అందర్నీ షాక్‌కు గురిచేస్తూ టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లతో సహా అతడి సతీమణి అనుష్క...
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ గురువారం అందర్నీ షాక్‌కు గురిచేస్తూ టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లతో సహా అతడి సతీమణి అనుష్క శర్మ సైతం స్పందించారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కోహ్లీ పంచుకున్న లేఖను పోస్టు చేసి దానికి హార్ట్ (లవ్ సింబల్) ఎమోజీ జత చేశారు. కాగా, పనిభారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ అనుష్క ఇలా స్పందించడం గమనార్హం.
కోహ్లీ నిర్ణయంపై ఎవరేమన్నారంటే..
ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ టీ20 బాధ్యతల నుంచి తప్పుకోవడం అనేది నిజంగా షాక్‌కు గురి చేసింది. కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు పొట్టి ప్రపంచకప్ సాధించి అతడికి ఎప్పటికి గుర్తుండేలా అందిస్తే అద్భుతంగా ఉంటుంది. కోహ్లీ తర్వాత టీమ్ఇండియా గొప్ప విజయాలతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా.-ఇర్ఫాన్ పఠాన్
చివరికి కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్ అతడికి మొదటిది, ఆఖరిది కూడాను. నవంబర్ 14న అతడు ప్రపంచకప్ అందుకోవాలని ఆశిద్దాం. -ఆకాశ్ చోప్రా
కోహ్లీ.. ఈ టీ20 ప్రపంచకప్ సాధించి దేశానికి కీర్తి, ప్రతిష్ఠలు తీసుకువస్తావని ఆశిస్తున్నా.-వెంకటేశ్ ప్రసాద్
విరాట్ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేం నీతోనే ఉంటాం. నీ సారథ్యంలో మనం ఈ ప్రపంచకప్ గెలవబోతున్నామని బలంగా నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్. -మునాఫ్ పటేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం