Neeraj Chopra: బైజుస్‌ భారీ ప్రకటన.. నీరజ్‌కు రూ. 2 కోట్లు

ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజుస్‌ భారత ఒలింపిక్స్‌ పతక విజేతలకు భారీ నగదు ప్రకటన చేసింది. శనివారం ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ (జావెలిన్‌ త్రో) విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రాకు...

Updated : 09 Aug 2021 10:33 IST

ఇతర అథ్లెట్లకు రూ.కోటి చొప్పున వెల్లడి

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజుస్‌ భారత ఒలింపిక్స్‌ పతక విజేతలకు భారీ నగదు ప్రకటన చేసింది. శనివారం ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ (జావెలిన్‌ త్రో) విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రాకు రూ.2 కోట్ల నజరానా ప్రకటించింది. ఇక మిగతా అథ్లెట్లలో మీరాబాయి చాను, రవికుమార్‌ దాహియా, లవ్లీనా బార్గోహేన్‌, పీవీ సింధు, బజ్‌రంగ్‌ పునియాకు తలా రూ.కోటి చొప్పున ఇస్తున్నట్టు వెల్లడించింది.

‘2020-21 కాలంలో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌తో సవాళ్లు ఎదురైనా టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు అద్భుతం, స్ఫూర్తిదాయకం’ అని ఆ సంస్థ కొనియాడింది. వీరంతా దేశాన్ని గర్వపడేలా చేయడమే కాకుండా భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించవచ్చనే స్ఫూర్తిని, పట్టుదలను రగిలించారని పేర్కొనింది. దేశాభివృద్ధిలో క్రీడలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయని, ఇప్పుడు ఒలింపిక్స్‌ విజయాలను ఆస్వాదించాల్సిన సమయమని బైజుస్‌ సీఈవో బైజు రవీంద్రన్‌ పేర్కొన్నారు. ఈ విజేతలంతా అందరి ప్రేమాభిమానాలకు అర్హులని అన్నారు. ఒలింపిక్స్‌లో గెలవడానికి వాళ్లు పడిన కష్టాలు, చేసిన త్యాగాలు, సాధించిన విజయాలకు ఈ నగదు నజరానా ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.

మొత్తంగా ఒలింపిక్స్‌లో భారత్‌కిదే అత్యుత్తమ రికార్డు. మునుపెన్నడూ లేని విధంగా ఒక స్వర్ణం, రెండు రజతాలతో పాటు నాలుగు కాంస్య పతకాలు సాధించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యధికంగా ఆరు పకతాలు నెగ్గింది. అందులో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉండటం గమనార్హం. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది. ఈ విజేతలంతా భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించొచ్చనే ధీమా కలిగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు