Published : 25/08/2021 12:06 IST

Bumrah vs Anderson: బుమ్రాలో ఔట్‌ చేసే ఉద్దేశమే కనిపించలేదు.. అందుకే అలా: అండర్సన్‌

లీడ్స్‌: లార్డ్స్‌ టెస్టులో జస్ప్రీత్‌ బుమ్రా తనను ఔట్‌ చేసేందుకు ప్రయత్నించలేదని ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అంటున్నాడు. అదే పనిగా బౌన్సర్లు సంధించాడని తెలిపాడు. అందుకే తాను అలా స్పందించానని వెల్లడించాడు.

రెండో టెస్టులో అండర్సన్‌కు బుమ్రా 10 బంతులతో కూడిన ఓవర్‌ విసిరాడు. అందులో ఎక్కువగా బౌన్సర్లే ఉన్నాయి. ఒక బంతి అతడి హెల్మెట్‌కు సైతం తగిలింది. టీమ్‌ఇండియా వ్యూహాలు నచ్చని అండర్సన్‌.. బుమ్రాను మాటలన్నాడు. ఆ తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.

‘పిచ్‌ నెమ్మదిగా ఉందని చెప్పడంతోనే నేను ఆఫ్‌గార్డ్‌ తీసుకున్నాను. వారు చెప్పినట్టే పిచ్‌ నిజంగానే మందకొడిగా ఉంది. బుమ్రా సాధారణ వేగం కన్నా నెమ్మది బంతులు వేస్తున్నాడని జో రూట్‌ నాతో చెప్పాడు. కానీ నేను ఎదుర్కొన్న తొలి బంతే 90 మైళ్ల వేగంతో వచ్చింది. అలాంటి బంతిని నేను నా కెరీర్లోనే ఎదుర్కోనట్టు అనిపించింది. అతడు నన్ను ఔట్‌ చేసేందుకు ప్రయత్నించడం లేదని అనిపించింది’ అని అండర్సన్‌ అన్నాడు.

‘బుమ్రా ఓ ఓవర్‌ విసిరాడు. అందులో బహుశా 10, 11, 12 (నిజానికి 10) బంతులు వేశాడనుకుంటా. వరుసపెట్టి నో బాల్స్‌, షార్ట్‌పిచ్‌ బంతులు వేశాడు. అతడో రెండు బంతుల్ని స్టంప్స్‌కు సైతం విసిరాడు. వాటిని నేను అడ్డుకొన్నాను’ అని అండర్సన్‌ అన్నాడు. ఆ ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత బుమ్రాను జిమ్మీ బూతు మాటలు అన్నాడు.

‘అండర్సన్‌ అనుభవాన్ని ఇంగ్లాండ్‌ వ్యక్తిగతంగా తీసుకుంది. నిజానికి ఏం జరిగిందో తనకు తెలియదని బుమ్రా చెప్పాడు. కానీ మేమంతా ఒక్కచోటకు చేరి అండర్సన్‌ ఎలాంటి అశ్లీల పదజాలం వాడాడో వివరించాం. అదే మాలో జ్వాలను రగిలించింది. ఇక ఆ తర్వాత జరిగింది అద్భుతమే’ అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్లో చెప్పడం గమనార్హం.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని