Updated : 26/11/2021 17:19 IST

IND vs NZ: వికెట్‌ కోసం భారత్‌ విశ్వప్రయత్నాలు.. బెదరని కివీస్‌ ఓపెనర్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓపికగా ఆడితే పరుగులు ఎలా వస్తాయో చేసి చూపించారు.. కివీస్‌ ఓపెనర్లు. ఓ పక్క పేస్‌.. మరోవైపు భీకరమైన స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ పరుగులు రాబట్టారు. ఇదే క్రమంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అర్ధశతకాలు సాధించేశారు. తొలి రోజు ఆధిక్యత సాధించిన టీమ్ఇండియాపై రెండో రోజు న్యూజిలాండ్‌ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించింది.

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్‌ చేసిన కివీస్‌.. రెండో రోజు ఆట ముగిసేసమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. భారత్‌ కంటే ఇంకా 216 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రోజు నాలుగు వికెట్లు.. రెండో రోజు స్వల్ప స్కోరుకే ఆరు వికెట్లను కోల్పోయిన భారత్‌కు భిన్నంగా న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ సాగింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఓపెనింగ్‌ జోడి టామ్‌ లాథమ్‌ (50*), విల్‌ యంగ్‌ (75*) శతక భాగస్వామ్యం నిర్మించారు. క్రీజ్‌లో కుదురుకున్నాక భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ పరుగులు రాబట్టారు. దీంతో కివీస్‌ వికెట్‌ను పడగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన టీమ్‌ఇండియా బౌలర్లకు చుక్కెదురైంది. న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోకుండా ఆటను ముగించింది.

చెలరేగిన టిమ్‌ సౌథీ.. 

తొలి రోజు భారత్‌ను జేమీసన్‌ (3/91) కట్టడి చేస్తే.. ఇవాళ టీమ్‌ఇండియా కుప్పకూలడంలో టిమ్‌ సౌథీ (5/69), అజాజ్‌ పటేల్ (2/90) కీలక పాత్ర పోషించారు. రెండో రోజు కివీస్‌ తీసిన ఆరు వికెట్లలో నాలుగు సౌథీకి, రెండు అజాజ్‌కు దక్కాయి. శ్రేయస్‌ అయ్యర్ (105) శతకంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగలిగింది. 258/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ కేవలం 87 పరుగులే చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే రవీంద్ర జడేజా (50) అదనంగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. తర్వాత వచ్చిన సాహా (1) విఫలమయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగానే ఆడిన శ్రేయస్‌ కెరీర్‌లో తన తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం బాదేసిన 16వ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే కాసేపటికే శ్రేయస్‌, అక్షర్‌ పటేల్ (3) ఔటయ్యారు. దీంతో చివర్లో అశ్విన్‌ (38) బ్యాట్‌ను ఝళిపించాడు. ఆఖర్లో ఉమేశ్‌ యాదవ్‌ (10*) ఎంతో నిలకడగా ఆడాడు. మిగతా భారత బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్ 13, శుభ్‌మన్ గిల్‌ 52, రహానె 35, పుజారా 26 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని