INDvsENG: తొలి 2 టెస్టులకు ఇంగ్లాండ్‌ జట్టు ఇదే

టీమ్‌ఇండియాతో ఐదు టెస్టుల సిరీసుకు ఇంగ్లాండ్‌ సిద్ధమైంది. తొలి రెండు టెస్టులకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దిగ్గజ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, ఒలీ రాబిన్సన్‌, ఐదేళ్ల తర్వాత ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ జట్టులోకి వచ్చారు....

Updated : 27 Feb 2024 15:03 IST

లండన్‌: టీమ్‌ఇండియాతో ఐదు టెస్టుల సిరీసుకు ఇంగ్లాండ్‌ సిద్ధమైంది. తొలి రెండు టెస్టులకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దిగ్గజ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, ఒలీ రాబిన్సన్‌, ఐదేళ్ల తర్వాత ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ జట్టులోకి వచ్చారు. నాటింగ్‌హామ్‌ వేదికగా ఆగస్టు 4న తొలి టెస్టు ఆరంభమవుతుంది. 12-16 వరకు లార్డ్స్‌లో రెండో టెస్టు జరుగుతుంది.

గాయాలతో సతమతం అవుతున్న జోఫ్రా ఆర్చర్‌,  క్రిస్‌వోక్స్‌ ఇంకా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించలేదు. దాంతో సీనియర్లు జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌తో కలిసి మార్క్‌వుడ్‌, సామ్‌ కరన్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకుంటారు. ఏడేళ్ల క్రితం చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలతో సస్పెండైన ఒలీ రాబిన్సన్‌ తిరిగి జట్టులో చేరాడు. జానీ బెయిర్‌స్టో, జోస్‌ బట్లర్‌ వచ్చేశారు. జో రూట్‌, రోరీ బర్న్స్‌, ఒలీ పోప్‌, జాక్‌ క్రాలీ, డామ్‌సిబ్లీ, డాన్‌ లారెన్స్‌ బ్యాటింగ్‌ బాధ్యతలు తీసుకుంటారు.

ప్రస్తుతం లాంకాషైర్‌కు ఆడుతున్న 24 ఏళ్ల హమీద్‌ జట్టులో చేరడం విశేషం. చివరి సారిగా అతడు 2016లో టీమ్‌ఇండియాపై టెస్టు ఆడాడు. ప్రస్తుతం భారత్‌తో కౌంటీ ఎలెవన్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడు. అతడిని ‘బేబీ బాయ్‌సీ’ అంటూ జెఫ్రీ బాయ్‌కాట్‌తో పోలుస్తుంటారు. దుర్భేద్యమైన డిఫెన్స్‌ అతడి సొంతం.

ఇంగ్లాండ్‌ జట్టు: జో రూట్‌ (కెప్టెన్‌), జేమ్స్‌ అండర్సన్‌, బెన్‌స్టోక్స్‌, జానీ బెయిర్‌స్టో, డామ్‌ బెస్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, జాక్‌ క్రాలీ, సామ్‌ కరన్‌, హసీబ్‌ హమీద్‌, డాన్‌ లారెన్స్‌, జాక్‌ లీచ్‌, ఒలీ పోప్‌, ఒలీ రాబిన్సన్‌, డామ్‌ సిబ్లీ, మార్క్‌వుడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని