Updated : 02/09/2021 17:57 IST

IND vs ENG: ఆటతీరు మారని భారత్‌.. తొలిసెషన్‌లో ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం

లండన్‌: నాలుగో టెస్టులోనూ టీమ్‌ఇండియా ఆటతీరు మారలేదు. అలవాటైన పద్ధతుల్లోనే మళ్లీ వికెట్ల సమర్పణ ప్రారంభించింది. తొలి రోజు తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఇంగ్లాండ్‌ పేసర్లు అండర్సన్‌, రాబిన్‌సన్‌, క్రిస్‌వోక్స్‌ చెలరేగడంతో ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. దాంతో తొలి సెషన్‌ ముగిసేసరికి టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(18), రవీంద్ర జడేజా(2) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు రోహిత్‌ శర్మ(11), రాహుల్‌(17)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా(4) విఫలమయ్యాడు. తొలుత వోక్స్‌ రోహిత్‌ను ఔట్‌చేసి ఇంగ్లాండ్‌కు శుభారంభం అందించగా కాసేపటికే రాహుల్‌, పుజారాలను.. రాబిన్‌సన్‌, అండర్సన్‌ పెవిలియన్‌ పంపారు. దాంతో భారత్‌ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, కోహ్లీ తర్వాత రహానె రాకుండా జడేజా క్రీజులోకి రావడం గమనార్హం.

కోహ్లీ @ 23,000 

మరోవైపు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు. అతితక్కువ 490 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. అప్పట్లో సచిన్‌ 522 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఘన సాధించగా తర్వాత ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ 544 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా ఆల్‌టౌమ్‌ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ 551 మ్యాచ్‌ల్లో, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్‌ కుమార సంగక్కర 568, రాహుల్‌ ద్రవిడ్‌ 576, మహేలా జయవర్దెనె 645 మ్యాచ్‌ల్లో తర్వాతి స్థానాల్లో నిలిచారు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని