INDvsENG: శతకం దిశగా జోరూట్‌.. టీ బ్రేక్‌ సమయానికి ఇంగ్లాండ్ 298/3

టీమ్ఇండియాపై ఇంగ్లాండ్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో సెషన్‌లోనూ ఆ జట్టు మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది. కెప్టెన్‌ జో రూట్‌(80*), డేవిడ్‌ మలన్‌(70) మూడో వికెట్‌కు 139 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు...

Updated : 26 Aug 2021 20:35 IST

లీడ్స్‌: టీమ్ఇండియాపై ఇంగ్లాండ్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో సెషన్‌లోనూ ఆ జట్టు మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది. కెప్టెన్‌ జో రూట్‌(80*) శతకంవైపు దూసుకెళ్తుండగా.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌(70) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దాంతో వీరిద్దరూ 139 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ టీ బ్రేక్‌ సమయానికి 94 ఓవర్లలో 298/3 స్కోర్‌తో నిలిచింది. ఈ సెషన్‌ ముగిసేముందు సిరాజ్‌ బౌలింగ్‌లో మలన్‌ కీపర్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఆధిక్యం 220 పరుగులుగా నమోదైంది.

అంతకుముందు భోజన విరామ సమయానికి 182/2తో ఉన్న ఇంగ్లాండ్‌ను రూట్‌, మలన్‌ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ సారథి వన్డే ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి మలన్‌ నుంచి పూర్తి సహకారం అందింది. ఈ క్రమంలోనే రూట్‌ తొలుత అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై మలన్‌ కూడా వేగంగా పరుగులు సాధించి ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. అంతకుముందు ఓపెనర్లు రోరీ బర్న్స్‌(61), హమీద్‌(68) కూడా అర్ధ శతకాలతో రాణించారు. దాంతో 2012 తర్వాత తొలిసారి ఒకే ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ టాప్‌ నలుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధశతకాలతో రాణించారు. ఇక ఈ సెషన్‌లో ఇంగ్లాండ్‌ మొత్తం 26 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 116 పరుగులు సాధించి ఒక వికెట్‌ నష్టపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు