Updated : 03/09/2021 17:43 IST

IND vs ENG: ఇంగ్లాండ్‌ను ఆదుకుంటున్న పోప్‌, బెయిర్‌స్టో

రెండోరోజు తొలి సెషన్‌ పూర్తి.. ఇంగ్లాండ్‌ 139/5

లండన్‌: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండోరోజు ఆటలో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగిస్తోంది. భోజన విరామ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 53/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ (31), క్రేగ్‌ ఓవర్టన్‌ (1) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఇద్దరూ ఉమేశ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్‌, కోహ్లీలకు చిక్కారు. దాంతో ఇంగ్లాండ్‌ 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కానీ తర్వాత నెమ్మదిగా ఆడిన ఓలీ పోప్‌ (38*), జానీ బెయిర్‌స్టో (34*) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో ఇంగ్లాండ్‌ 139/5 స్కోర్‌తో నిలిచింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ మూడు, బుమ్రా రెండు వికెట్లు తీశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని