IND vs NZ: రోహిత్‌ విషయంలో అది జరగలేదు: గంభీర్‌

నూతన టీ20 సారథిగా రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడాడని, న్యూజిలాండ్‌ సిరీస్‌తో జట్టు పగ్గాలు అందుకున్న అతడు కెప్టెన్‌గా,  బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టాడని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు...

Published : 23 Nov 2021 09:08 IST

ఒత్తిడిలోకి వెళ్లకుండా స్వేచ్ఛగా ఆడాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: నూతన టీ20 సారథిగా రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడాడని.. న్యూజిలాండ్‌ సిరీస్‌తో జట్టు పగ్గాలు అందుకున్న అతడు కెప్టెన్‌గా,  బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టాడని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఆదివారం జరిగిన మూడో టీ20లోనూ టీమ్‌ఇండియా విజయం సాధించి  సిరీస్‌ క్లీన్‌స్వీప్ చేయడంపై అతడు స్పందించాడు. ఒక క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడు కెప్టెన్‌గా ఒత్తిడిని దరిచేరనీయకుండా చాలా స్వేచ్ఛగా ఆడాడని అభిప్రాయపడ్డాడు.

‘రోహిత్‌ నిలకడగా పెద్ద స్కోర్లు సాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్‌ అయ్యాక కూడా అలాగే రాణించడం శుభపరిణామం. అతడి ఆటతీరు టీమ్‌ఇండియాకు పెద్ద సానుకూల అంశం. ఎందుకంటే కొన్నిసార్లు కెప్టెన్సీ ఆయా ఆటగాళ్ల స్వేచ్ఛను హరిస్తుంది. అది రోహిత్‌ విషయంలో జరగలేదు. అతడు ఇంతకుముందు కెప్టెన్సీ చేసినా అది పూర్తిస్థాయిలో కాదు. ఈ సిరీస్‌తో ఆయన పరిణతి ఏంటో తెలిసొచ్చింది. రోహిత్‌ రాణించడం ఆశ్చర్యం కలిగించకపోయినా.. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గానూ స్వేచ్ఛగా ఆడిన విధానమే ఆకట్టుకుంది’ అని గంభీర్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు