IND vs NZ: హర్షల్ పటేల్‌ ఇలా ఔటయ్యావేంటి..?

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా కొత్త ఆల్‌రౌండర్‌ హర్షల్‌ పటేల్‌ హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో ఇలా ఔటైన రెండో ఆటగాడిగా నిలిచాడు...

Updated : 22 Nov 2021 13:57 IST

టీ20ల్లో కేఎల్‌ రాహుల్‌ తర్వాత ఇతడే..

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా కొత్త ఆల్‌రౌండర్‌ హర్షల్‌ పటేల్‌ హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో ఇలా ఔటైన రెండో ఆటగాడిగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌ చేస్తుండగా న్యూజిలాండ్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ వేసిన 18.3 ఓవర్‌కు పటేల్‌ షాట్‌ ఆడబోయి తన బ్యాట్‌ను వికెట్లకు తాకించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే పటేల్‌ (18; 11 బంతుల్లో 2x4, 1x6) క్రీజులో ఉన్నంతసేపు తన బ్యాటింగ్‌తో అలరించాడు. ఇక ఫెర్గూసన్‌ వేసిన 19వ ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్‌ బాదిన అతడు రెండో బంతిని ఆడలేకపోయాడు. దీంతో మూడో బంతిని కట్‌షాట్‌ ఆడాలని ప్రయత్నించి హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అతడు క్రీజులో మరీ వెనక్కి నిలబడి బంతిని ఎదుర్కొనే క్రమంలో బ్యాట్‌ వికెట్లకు తాకింది. దీంతో బెయిల్స్‌ ఎగిరిపడి అతడు ఔటయ్యాడు. కాగా, ఇంతకుముందు కేఎల్‌ రాహుల్‌ 2018లో నిదహాస్‌ ట్రోఫీలో శ్రీలంకతో ఆడిన ఒక టీ20 మ్యాచ్‌లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హర్షల్‌ పటేల్‌ అదే విధంగా ఔటయ్యాడు. అతడెలా ఔటయ్యాడో మీరూ చేసేయండి.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని