Ravichandran Ashwin: భజ్జీని అధిగమించడం సంతోషమే అయినా.. చెప్పడానికి ఏమీ లేదు

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు క్రికెట్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఇదివరకు మూడో స్థానంలో ఉన్న దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను అతడు అధిగమించాడు...

Updated : 30 Nov 2021 09:37 IST

ఇక మిగిలింది కపిల్‌దేవ్‌, అనిల్‌ కుంబ్లే..!

కాన్పూర్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు క్రికెట్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఇదివరకు మూడో స్థానంలో ఉన్న దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను అతడు అధిగమించాడు. హర్భజన్‌ 103 టెస్టుల్లో 417 వికెట్లు తీయగా.. అశ్విన్‌ 80 మ్యాచ్‌ల్లోనే 419 వికెట్లతో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక దిగ్గజాలు అనిల్‌ కుంబ్లే (132 టెస్టుల్లో 619 వికెట్లు), కపిల్‌ దేవ్‌ (131 టెస్టుల్లో 434 వికెట్లు) మాత్రమే అతడి కన్నా ముందున్నారు. కపిల్‌ను అశ్విన్‌ అధిగమించడం లాంఛనమే అయినా.. కుంబ్లేను దాటాలంటే మరో నాలుగైదేళ్లు జట్టులో కొనసాగుతూ.. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చెయ్యాలి.

కాగా, భజ్జీని అధిగమించడంపై అశ్విన్‌ మాట్లాడుతూ.. ఇందులో స్పందించడానికి ఏమీ లేదన్నాడు. ‘‘హర్భజన్‌ను అధిగమించడంపై చెప్పడానికేమీ లేదు. మైలురాళ్లు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇది సంతోషకరమైన విషయమే. పదేళ్లు క్రికెట్‌ ఆడాక ఎన్ని వికెట్లు తీశామన్నది కాదు.. మనకు ఎన్ని మంచి జ్ఞాపకాలున్నాయన్నది ముఖ్యమని కోచ్‌గా వచ్చాక రాహుల్‌ భాయ్‌ అన్నాడు. వచ్చే మూణ్నాలుగేళ్లలో అలాంటి మరిన్ని జ్ఞాపకాలను పోగు చేసుకోవాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. మరోవైపు అశ్విన్‌ తన రికార్డును అధిగమించడంపై హర్భజన్‌ స్పందించాడు. అతడికి కంగ్రాట్స్‌ చెబుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షించాడు. మున్ముందు కూడా ఇలాగే రాణిస్తూ కొనసాగాలని ట్వీట్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని