IND vs NZ: టీమ్ఇండియా తీరుకు ఆశ్చర్యపోయా: షేన్‌వార్న్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు చివరి సెషన్లో టీమ్ఇండియా తీరుకు స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వార్న్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు...
అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేకపోయింది
ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు చివరి సెషన్లో టీమ్ఇండియా తీరుకు స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వార్న్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సోమవారం ఐదోరోజు ఆటలో న్యూజిలాండ్ చివరి వికెట్ కాపాడుకొని మ్యాచ్‌ను డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే, ఇన్నింగ్స్ 81వ ఓవర్ పూర్తయ్యాక టీమ్ఇండియా కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా నాలుగు ఓవర్లు ఆలస్యంగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. తర్వాత జడేజా కొత్త బంతితో రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలోనే రెండు వరుస ట్వీట్లు చేసిన షేన్‌వార్న్ భారత జట్టు ఆలోచనా విధానాలు తనను చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పాడు. ‘భారత జట్టు కొత్త బంతిని తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోలేదు. ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. వెలుతురు సరిగ్గా లేని పరిస్థితుల్లో, ఓవర్లు పూర్తవుతున్న క్రమంలోనూ పాత బంతితోనే బౌలింగ్ చేస్తోంది. ఇది విచిత్రంగా ఉంది’ అంటూ మ్యాచ్ జరుగుతుండగానే ఒక పోస్టు చేశాడు. కాసేపటికే మరో ట్వీట్లో..‘ముందే కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా.. అదే పాత బంతితో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారేదా..? న్యూజిలాండ్ వెనుకపడేదా? లేక ఇండియా గెలిచేదా?’ అని తన సందేహాలను వెలిబుచ్చాడు. కాగా, టీమ్ఇండియా ఆఖరి క్షణాల్లో ఒక్క వికెట్ తీసేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను నిలిపివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా