Shreyas Iyer: అరంగేట్రం టెస్టులోనే శతకం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (100*) శతకం సాధించాడు. అరంగేట్రం టెస్టులోనే మూడంకెల స్కోర్‌ సాధించి సత్తా చాటాడు...

Updated : 26 Nov 2021 10:50 IST

అదరగొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13X4, 2X6) శతకం సాధించాడు. అరంగేట్రం టెస్టులోనే మూడంకెల స్కోర్‌ సాధించి సత్తా చాటాడు. దీంతో అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు. తొలి రోజు జడేజా (50)తో కలిసి శ్రేయస్‌ (75) ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పగా టీమ్‌ఇండియా 258/4 స్కోర్‌తో మంచి స్థితిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించగా ఆదిలోనే జడ్డూ ఔటయ్యాడు. ఇదే క్రమంలో ఫోర్లతో విరుచుకుపడిన శ్రేయస్‌ టెస్టుల్లో తొలి మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. జేమీసన్‌ వేసిన 91.1 ఓవర్‌కు రెండు పరుగులు తీసి ఈ మైలురాయి చేరుకున్నాడు. అనంతరం సౌథీ బౌలింగ్‌లో విల్‌యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం టెస్టులోనే శతకం సాధించిన 16వ బ్యాట్స్‌మన్‌గా, న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు