
IND vs NZ: రోహిత్-రాహుల్‌ల ఒత్తిడి నుంచి తేరుకోవడం చాలా కష్టం: శాంట్నర్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తమపై తీసుకొచ్చే ఒత్తిడి నుంచి తేరుకోవడం చాలా కష్టమని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కేన్ విలియమ్సన్ విశ్రాంతి తీసుకోవడంతో ఈ సిరీస్‌లో కివీస్ ఇద్దరు సారథులను నియమించింది. తొలి రెండు మ్యాచ్‌లకు టిమ్‌సౌథీ నాయకత్వం వహించగా చివరి మ్యాచ్‌కు శాంట్నర్ జట్టు పగ్గాలు తీసుకున్నాడు. మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాక మాట్లాడిన అతడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాత్రి వేళ మంచు ప్రభావాన్ని అంచనా వేయడం కష్టమని తెలిపాడు.
‘ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు ఆదిలోనే అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అక్షర్ అదరగొట్టాడు. ఈ సిరీస్ మొత్తంలో మాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన భారత జట్టుకే క్రెడిటంతా దక్కుతుంది. నిజం చెప్పాలంటే మేమంత సరిగ్గా ఆడలేదు. ఇక రోహిత్-రాహుల్ మాపై తీసుకొచ్చే ఒత్తిడి నుంచి తేరుకోవడం చాలా కష్టం. మా జట్టులో కేన్ విలియమ్సన్ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. విపరీతమైన మా షెడ్యూల్ కారణంగా అతడీ సిరీస్ ఆడలేదు. దీంతో కొందరు యువకులకు అవకాశాలు వచ్చాయి. తర్వాతి టీ20 ప్రపంచకప్ మరో 11 నెలల్లోనే ఉండటంతో ఇకపై ఎలా ఆడాలనేది ఆలోచించాలి. ఇవాళ మా జట్టులో గప్తిల్ బాగా ఆడాడు’ అని శాంట్నర్ వివరించాడు.
ఈ మ్యాచ్ ద్వారా నమోదైన రికార్డులు..
* న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియాకు ఇది వరుసగా 8వ ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం.
* 20ల్లో మూడు, అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు కలిగిన టోర్నీల్లో అత్యధిక క్లీన్‌స్వీప్ (6 సార్లు) సాధించిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు పాకిస్థాన్ సైతం సమానంగా నిలిచింది.
* పరుగుల పరంగా న్యూజిలాండ్‌కిది నాలుగో అతిపెద్ద ఓటమి.
► Read latest Sports News and Telugu News